రాత్రిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది.

By -  Medi Samrat
Published on : 12 Dec 2025 4:05 PM IST

రాత్రిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చింతూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

ఈ ప్రమాదం తర్వాత ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై రాత్రిపూట భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లారీలు, బస్సులు వంటి హెవీ వాహనాలు ఘాట్ రోడ్లలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. ప్రమాదాలు నివారించేందుకు ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రాగా, నియమాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Next Story