కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో చాలానే

Preparations for the formation of districts in AP.ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో చాలా కసరత్తులే

By M.S.R  Published on  23 Feb 2022 6:26 AM GMT
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో చాలానే

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో చాలా కసరత్తులే జరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల విషయంలో నిరసనలు కూడా మొదలయ్యాయి. తాజాగా జిల్లాల విషయంలో అభ్యంతరాలు, సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు. అన్ని జిల్లాల్లో కలిపి 1478 అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించారు అధికారులు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700 అభ్యంతరాలు వచ్చాయి. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు వచ్చినట్లుగా చెబుతున్నారు అధికారులు. మొత్తం 13 జిల్లాల కలెక్టర్లతో ఈనెల 28వ తేదీ వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం నగరంలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. కృష్ణ ,పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో 23వ తేదీన విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. 24వ తేదీన తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది. 26వ తేదీన అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగబోతుంది. 28వ తేదీన విశాఖపట్నంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ప్లానింగ్ సెక్రటరీ, సీసీఎల్ఏ సెక్రటరీ, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కమిటీ సిఫార్సులు ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్‌లో మార్పులు,చేర్పులపై సీఎస్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఉగాది రోజు (ఏప్రిల్‌2) నుండి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Next Story