ఏపి ఎన్నికలలో కొత్త మార్పు.. పోలింగ్ కొత్త గా..!

Polling Time Changed In AP Elections. కొవిడ్ దృష్ట్యా నాలుగు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని గణనీయంగా పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat
Published on : 7 Feb 2021 8:32 AM IST

Polling Time Changed In AP Elections.

కొవిడ్ దృష్ట్యా నాలుగు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని గణనీయంగా పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో జరిగే పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె. కన్నబాబు స్పష్టం చేశారు.

కొవిడ్ దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే చర్యలు చేపట్టినట్లు కన్నబాబు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలింగ్ ముగించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సమయం గురించి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది.




Next Story