పోలవరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

Polavaram Project Works Update.పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం చేశారు. దీంతో గోదావరి వరద దిశ మారనుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2021 11:49 AM IST
Polavaram Project

ఈ ఏడాది చివ‌రి నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును ఎట్టి ప‌రిస్థితుల్లో పూర్తి చేయాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ చ‌కచగా పనులు పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం చేశారు. దీంతో గోదావరి వరద దిశ మారనుంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయింది. సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసివేశారు.


సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసివేయడంతో వరద నీరు దిశ మారనుంది. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యేడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గోదావరి నదీ ప్రవాహాన్ని తరలించనున్నారు. స్పిల్‌వే ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.




Next Story