పిఠాపురం వర్మ.. మరోసారి అవే వ్యాఖ్య‌లు..!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 9 April 2025 7:16 PM IST

పిఠాపురం వర్మ.. మరోసారి అవే వ్యాఖ్య‌లు..!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన వర్మ, ఇప్పుడు లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు వర్మ. పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని, లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని చంద్రబాబును కోరారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ ప్రశంసించారు. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story