ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. చీఫ్‌ గెస్ట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్

ఈరోజు సాయంత్రం విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగనుండగా, ఈ వేదికపై

By అంజి  Published on  28 April 2023 8:00 AM GMT
NTR centenary celebrations, Vijayawada , Superstar Rajinikanth, TDP

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. చీఫ్‌ గెస్ట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్

ఈరోజు సాయంత్రం విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగనుండగా, ఈ వేదికపై ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు.

ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్దన్, సావనీర్ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. 2004లో కృష్ణానది పుష్కరాల సందర్భంగా రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. దాదాపు 50 వేల మంది హాజరువుతారనే అంచనాతో టీడీపీ ఏర్పాట్లు చేసింది.

Next Story