ఏపీలో హింసాత్మక ఘటనల ఎఫెక్ట్.. బాటిళ్లలో పెట్రోల్‌కు నో!
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 May 2024 7:12 PM ISTఏపీలో హింసాత్మక ఘటనల ఎఫెక్ట్.. బాటిళ్లలో పెట్రోల్‌కు నో!
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై స్పందించిన ఈసీ కూడా సీరియస్‌గా చర్యలు తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులపై వేటు వేసింది. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడిచంఇంది. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని గతంలో పోలీసులు కూడా చెప్పారు. ఇక ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలో మరోసారి ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఇప్పుడు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల, డీజిల్‌ను బాటిళ్లలో అమ్మొద్దని యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత పెట్రోల్‌ను బాటిళ్లలో అమ్మడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అలాగే పోలింగ్ సందర్భంగా ఓ రాజకీయ నేత ఇంట్లో పెట్రోల్ బాంబులు దొరకడం ఏపీ పోలీసుల్లో కలవరం రేపుతోంది. మరోసారి హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా ఉండేందుకు పటిష్ట ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు.. పోలీసుల సూచనతో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కూడా అలర్ట్ అయ్యాయి. మరోవైపు వాహనాల్లో పెట్రోల్ ఉన్నట్లుండి అయిపోతే ఏంటి పరిస్థితి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.