కాకినాడ జిల్లా తునిలో మైనర్‌బాలికపై అత్యాచారయత్నం ఘటన కేసులో నిందితుడు నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకాడు. నారాయణరావును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళుతున్న సమయంలో నారాయణరావు బహిర్భూమికి వెళ్లాలని చెప్పి పోలీసుల వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న కోమటి చెరువులో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి అతడి కోసం చెరువులో గాలిస్తున్నారు.
నారాయణరావు అరెస్ట్‌పై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్పందించారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు.