'శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా'.. సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

Nara lokesh challenges CM Jagan on YS Viveka murder case. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు.

By అంజి  Published on  27 Sept 2022 12:43 PM IST
శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా..  సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. ట్విటర్‌లో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించారు. వైఎస్‌ వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని తిరుమల వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌.. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌ చేసిన ఛాలెంటజ్‌ ఇంట్రెస్టింగ్‌ మారింది.

''వివేకా గారి హత్య తో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21 న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి?. తిరుమల వెళ్తున్న మీరు ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా?'' అంటూ ట్వీట్ చేసి నారా లోకేష్‌ సవాల్ విసిరారు. అయితే లోకేష్‌ సవాల్‌పై సీఎం జగన్‌ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.


Next Story