Nandyala: గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

నంద్యాల జిల్లాలో గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున డోన్‌ రైల్వే పోలీస్ స్టేషన్‌లో...

By -  అంజి
Published on : 25 Jan 2026 7:12 PM IST

Nandyala, Constable died, service weapon misfires

Nandyala: గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

నంద్యాల జిల్లాలో గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున డోన్‌ రైల్వే పోలీస్ స్టేషన్‌లో డోన్‌ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) అవుట్‌పోస్టుకు అనుబంధంగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌ మిస్‌ఫైర్‌ కావడంతో మరణించాడు. పి. పెద్దయ్య 1995లో AP స్పెషల్ పోలీస్ (APSP) కానిస్టేబుల్‌గా పోలీసు దళంలో చేరారు. 2017లో, ఆయన ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR)కి అటాచ్ చేయబడి, డిప్యుటేషన్‌పై GRPకి పోస్టింగ్ పొందారు.

తన విధి నిర్వహణలో భాగంగా, పెద్దయ్య శనివారం నాడు గుంతకల్ నుండి డోన్‌ కు హుబ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. తిరిగి వచ్చేసరికి, అతను తన SM కార్బైన్ రివాల్వర్‌ను లాక్-అప్ గదిలో పెడుతుండగా, అది ప్రమాదవశాత్తూ పేలిందని చెబుతున్నారు.

'సేఫ్టీ క్యాచ్' మోడ్‌లో ఉండాల్సిన ఆయుధం 'సింగిల్ మోడ్'లో ఉండటం వల్లే మిస్‌ఫైర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయుధం లోడ్ అవుతుండగా, ఒక రౌండ్ బుల్లెట్ పెద్దయ్య ఎడమ చెంపలోకి దూసుకెళ్లి, అతను తక్షణమే మరణించాడని పోలీసులు తెలిపారు.

పెద్దయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. "కుటుంబ సభ్యులు మరణంపై ఎటువంటి సందేహాలు లేవనెత్తలేదు" అని పోలీసులు తెలిపారు.

Next Story