లోకేష్ పాద‌యాత్ర‌లో తారకరత్నకు తీవ్ర అస్వస్థత.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Nandamuri Taraka Ratna illness During Nara Lokesh Padayatra.పాద‌యాత్ర‌లో పాల్గొన్న న‌టుడు తార‌క‌ర‌త్న స్పృహ త‌ప్పి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 1:43 PM IST
లోకేష్ పాద‌యాత్ర‌లో తారకరత్నకు తీవ్ర అస్వస్థత.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ 'యువ‌గ‌ళం' పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో పాల్గొన్న న‌టుడు తార‌క‌ర‌త్న స్పృహ త‌ప్పి ప‌డిపోయారు.

కుప్పం స‌మీపంలోని ల‌క్ష్మీపురం శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం లోకేష్ పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. కొద్ది దూరం న‌డిచిన త‌రువాత మ‌సీదులో లోకేష్ ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. లోకేష్‌తో పాటు తార‌క‌ర‌త్న కూడా అందులో పాల్గొన్నారు.

మ‌సీదు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు తాకిడికి తార‌క‌ర‌త్న సొమ్మ‌సిల్లి ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. వెంట‌నే ఆయ‌న్ను కుప్పంలోని కేసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం అక్క‌డి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయ‌న్ను పీఈఎస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే బాల‌కృష్ణ ఆస్ప‌త్రికి చేరుకున్నారు. వైద్యుల‌ను అడిగి తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు.

ఇంకా మెరుగైన చికిత్స కోసం ఆయ‌న్ను బెంగ‌ళూరు లేదా హైద‌రాబాద్ త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Next Story