వాడ‌రేవు బీచ్‌లో బాల‌య్య సంద‌డి

Nandamuri Balakrishna Drive Topless jeep at Chirala Beach.సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 12:38 PM IST
వాడ‌రేవు బీచ్‌లో బాల‌య్య సంద‌డి

సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంబరాలను కారంచేడులోని తన సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో భార్య వ‌సుంధ‌ర‌, కుమారుడు మోక్షజ్ఞతో కలసి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శుక్ర‌వారం భోగి వేడుక‌ల్లో సంద‌డి చేసిన బాల‌య్య శ‌నివారం సంక్రాంతి సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డిపారు. బంధువుల‌తో క‌లిసి చీరాల‌లోని వాడ‌రేవు బీచ్ కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా టాప్ లెస్ ఫోర్డ్ జీప్‌లో భార్య వ‌సుంధ‌ర‌ను ప‌క్క‌న కూర్చోబెట్టుకుని స్వ‌యానా బాల‌య్య జీప్‌ను న‌డిపారు. ఇందుకు సంబంధిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

నిన్న పురందేశ్వ‌రి నివాసంలో స‌ర‌దాగా గుర్ర‌మెక్కి బాల‌య్య సంద‌డి చేశారు. బాలయ్య గుర్రం మీద స్వారీ చేయాలని ప్రయత్నిస్తున్న వేళ ఆ జిల్లా నలుమూల నుంచి వచ్చిన అభిమానులు జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. వాయిద్యాలతో స్థానికులు పాటలు పాడుతుంటే బాలయ్య గుర్రంపై డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. బాలయ్య తరువాత ఆయన వారసుడు నందమూరి మోక్షజ్క్ష కూడా గుర్రంపై స్వారీ చేయడంతో అక్కడున్న వారంతా ఆయనని చూసి కేరింతలు కొట్టారు.

Next Story