న‌గిరి ఎమ్మెల్యే రోజా క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా త‌న‌ను ఆహ్వానించ‌డం లేద‌ని చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రోజా క‌న్నీంటి ప‌ర్వంత‌మ‌య్యారు. క‌లెక్ట‌ర్ స‌హా ఎవ‌రూ త‌న‌ను పట్టించుకోవ‌డం లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు, ప్రోటోకాల్ విష‌యంలో అధికారుల తీరుపై క‌మిటీకి ఫిర్యాదు చేశారు. నగరిలో నియోజ‌క‌వ‌ర్గంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల విష‌యంలో నిర్వ‌హించిన స‌మావేశానికి అధికారులు త‌న‌కు స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. ఇదే విష‌య‌మై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

రోజా ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రోజా ఫిర్యాదు చేశారని.. అన్ని విషయాలకు జిల్లా కలెక్టర్‌కు చెప్పామని.. అవన్నీ సరిచేస్తామని తెలిపారు. ప్రొటోకాల్ విషయంలో ఏ శాసన సభ్యుడికి అన్యాయం జరిగినా తాము చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభా హక్కులు కాపాడటంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడాలేదని కాకాణి స్పష్టం చేశారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story