మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే స్థాయిని తగ్గించుకోవడమే: నాగబాబు

Nagababu Comments on Minister Roja. మెగా కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే స్థాయిని

By M.S.R  Published on  22 Jan 2023 9:15 PM IST
మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే స్థాయిని తగ్గించుకోవడమే: నాగబాబు

మెగా కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని జనసేన నేత నాగబాబు అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో... పాలన కూడా అలాగే ఉందని నాగబాబు సెటైర్లు వేశారు. ఆయన అనంతపురం నగరంలోని చెరువుకట్ట రోడ్డును పరిశీలించారు. జనసైనికులు రోడ్లు వేస్తామన్నారో లేదో వైసీపీ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు మొదలుపెట్టడం అభినందనీయమన్నారు. వైజాగ్‌లో తమ పార్టీ అధినేత పవన్‌‌కల్యాణ్‌ తో పాటు నాయకులను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. అయినా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఏవీ ఆగలేదన్నారు. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తాము చేయాల్సిన పని చేసి తీరతామన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు. సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి పవన్ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. ఏపీలో అసలు కాంగ్రెస్ ఎక్కడుందని.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసే వైసీపీగా మారిపోయిందన్నారు.

Next Story