ముస్లిం ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

ముస్లిం ఉద్యోగులు సాయంత్రం గంట ముందుగా కార్యాలయాన్ని వదిలి వెళ్లేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on  12 March 2023 2:29 PM IST
Muslim government staff , Ramzan

ముస్లిం ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ 

పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం గంట ముందుగా కార్యాలయాన్ని వదిలి వెళ్లేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి రేవు ముత్యాల రాజు జారీ చేసిన సర్క్యులర్ మార్చి 24 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఏప్రిల్ 23 వరకు అమలులో ఉంటుంది. సర్క్యులర్ ప్రకారం.. గ్రామ, వార్డు వాలంటీర్లతో సహా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందితో పాటు, ఇస్లాం మతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ తమ పని కార్యాలయాల నుంచి ఒక గంట ముందుగానే బయలుదేరవచ్చు.

మైనారిటీ టీచర్స్ అసోసియేషన్, ఇతర మైనారిటీ సంస్థల అభ్యర్థన మేరకు పవిత్ర రంజాన్ నెలలో ముందుగా బయలుదేరడానికి అనుమతి మంజూరు చేయబడింది. తద్వారా ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత తమ ఆచారాలను నిర్వహించుకోగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఎక్కువ మంది ముస్లింలు పగటిపూట ఉపవాసం ఉండే ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం పొడిగిస్తున్నదని వారు గుర్తు చేసుకున్నారు. రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు.

Next Story