తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ గుర్తుల్లేని పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాలు కాకుండా ఉండేందుకు నామినేష‌న్ వేస్తే రూ.2ల‌క్ష‌లు ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించార‌ని ఎద్దేవా చేశారు. దోచుకున్న డ‌బ్బుతో ఎంత‌కాలం అయిన పంచేందుకు బాబు సిద్ద‌మ‌య్యార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు.


'చంద్రబాబు జీవితమంతా డబ్బు వెదజల్లడమే. చివరికి పార్టీ గుర్తుల్లేని పంచాయతీ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే బంపర్ ఆఫర్ 2 లక్షలంట! కాస్త పోటీ ఇస్తారనుకుంటే ఐదు లక్షలు. ఆన్ లైన్ లో అకౌంట్ కే జమ చేస్తాడట. దోచుకున్న లక్షల కోట్లతో ఇలా ఎన్నాళ్లైనా డబ్బు పంపిణీకి సిద్ధమంటున్నాడు.' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.


'పదవి చిన్నదైనా, పెద్దదైనా ఎలక్షన్లలో పోటీ చేసే వాళ్లు గెలవాలని చూస్తారు. అందుకోసం రకరకాల వ్యూహాలు, ప్రచారపు ఎత్తుగడలను అమలు చేస్తారు. చంద్రబాబు మాత్రం గెలుపు సంగతి దేవుడెరుగు, ఏకగ్రీవం కాకుండా నామినేషన్ వేయిస్తే చాలనుకుంటున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ తిప్పలు అన్నీ ఇన్నీ కావు!' అంటూ మరో ట్వీట్‌ చేశారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story