వర్క్‌ ఫ్రమ్ పోలీస్‌ చేయొచ్చా? చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

చంద్రబాబు వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

By Srikanth Gundamalla
Published on : 21 Aug 2023 2:20 PM IST

MP Vijayasai Reddy, Satire, Chandrababu, TDP, YCP,

 వర్క్‌ ఫ్రమ్ పోలీస్‌ చేయొచ్చా? చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

చంద్రబాబు ఇటీవల ఊహించని విధంగా విమర్శలకు గురయ్యేలా మాట్లాడారు. ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్‌లో బైపీసీ చేయాలంటూ మాట్లాడారు. దాంతో.. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మరోసారి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయనంతట ఆయనే తన పరువు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు మాటలు విన్న ప్రజలు ఈనదేం విజనరీ అనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్‌ బైపీసీ చదివి ఇంజినీర్‌ కావొచ్చంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఆ తర్వాత పోలీస్‌ అయ్యి వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. ఆస్కార్‌ నామినేషన్స్‌కు వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చనీ.. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొనవచ్చని చమత్కరించారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలు ఇలానే ఉన్నాయంటూ సెటైర్లు విసిరారు. అంతేకాదు.. ఆయనలానే అది నేనే కట్టా.. ఇది నేనే కట్టాను అని కూడా చెప్పుకువచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఎక్కడ మంచి జరిగితే అది తాను మొదలు పెట్టడం వల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటారని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మహిళలకు రాఖీ ఇస్తానన్న చంద్రబాబు.. దాన్ని 45 రోజుల పాటు పూజించి, చేతికి కట్టుకుని, కష్టసమయంలో తనను తలుచుకుంటే భగవత్‌ సంకల్పానికి తోడుంటానని చెప్తున్నాడంటే తానే దైవంగా భావిస్తున్నారంటూ వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. మానసిక పరిస్థితి బాగా ఉన్నవారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అంటున్నారు. చంద్రబాబు ధోరణే ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం ఖాయమని వైసీపీ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story