చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
MP Vijayasai Reddy comments on Chandrababu naidu.టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకంపై వైసీపీ ఎంపీ విజయసాయి
By తోట వంశీ కుమార్
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడని ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని.. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలని కొనిపడేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నారని విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడని.. ఇప్పుడు పార్టీని డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని ఎంపీ అన్నారు.
పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 28, 2021
అటు బీజేపీలోకి కూడా తన మనుషులను పంపించాడని విజయసాయి ఆరోపించారు. కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించాడని ఆయన అన్నారు. 'మనవాళ్లు బ్రీఫుడ్ మీ' కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడని విజయసాయి అన్నారు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్‌లోకి తోలాడు. బాబా మజాకా! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడు. 'మనవాళ్లు బ్రీఫుడ్ మీ' కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలాడు. బాబా మజాకా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 28, 2021