వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

ఏపీలో అధికారపార్టీ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 11:21 AM IST
mp sri krishnadevaraya, resign, ycp, andhra pradesh,

వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీలో అధికారపార్టీ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా మరో నేత పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి, తన పదవికి రాజీనమా చేస్తున్నట్లు మంగళవారం స్వయంగా ప్రకటించారు. కాగా.. కొద్దిరోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో టికెట్ రావడం ఇక కష్టమే అని భావించిన ఆయన తాజాగా రాజీనామా చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన లావు శ్రీకృష్ణ దేవరాయలు.. పల్నాడు ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని చెప్పారు. ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారనీ గుర్తు చేశారు. ఇక తాను కూడా ప్రజల కోసం.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానన్నారు. గత 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని ఆయన అనన్నారు. తన టికెట్‌ విషయంలో క్యాడర్ కన్ఫ్యూజన్‌లో ఏర్పడిందని చెప్పారు. అయితే.. అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేశానని శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. నరసరావుపేటకు కొత్త అభ్యర్థిని తీసుకురావాలని హైకమాండ్ భావించింది. దాంతో.. కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీమా చేస్తున్నట్లు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించారు. కాగా.. ఆయన తర్వాత ఏ పార్టీలో చేరతారనేది మాత్రం ప్రకటించారు.


Next Story