డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

MP Raghurama Krishna Raju wrote Letter to DGP Rajendranath reddy.ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కసిరెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2022 3:50 PM IST
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి నరసాపురం వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. త‌న‌పై సీఐడీ అధికారుల దాడి ఘ‌ట‌న‌పై త్వ‌రిత‌గ‌తిన ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తప్పుడు కేసులు పెట్టి చిత్ర‌హింస‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. త‌న‌పై దాడి చేసిన వారిలో సీబీసీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్ కూడా ఉన్నార‌న‌న్నారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా నివేదిక కోరినా.. అప్ప‌టి డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ స్పందించ‌లేద‌ని ఆ లేఖ‌లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నివేదిక‌ను లోక్‌స‌భ స్పీక‌ర్‌కు పంపాల‌ని డీజీపీని ర‌ఘురామ కోరారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ విశ్వాసం క‌లిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. నిష్పక్షపాతంగా ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని కోరారు.

Next Story