రఘురామ లేఖాస్త్రాలు.. సీఎం జగన్‌కు వరుసగా ఐదోసారి

MP Raghurama Krishna Raju Fifth consecutive letter to CM Jagan.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 14 Jun 2021 8:46 AM IST

రఘురామ లేఖాస్త్రాలు.. సీఎం జగన్‌కు వరుసగా ఐదోసారి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సీఎంకు వరుసగా నాలుగు లేఖలు రాసిన ఎంపీ.. తాజాగా ఐదో లేఖ రాశారు. రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితుల‌కు ప‌రిహారం విడుద‌ల చేయాల‌ని అందులో కోరారు. ఎన్నిక‌ల్లో వైసీపీ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని కోరుతూ గ‌త నాలుగు రోజులుగా సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తున్నారు.

తొలి నాలుగు రోజుల్లో వృద్దాప్య పించ‌న్ల పెంపు, సీపీఎస్ ర‌ద్దు, పెళ్లికానుక‌.. షాదీముబార‌క్‌, ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ అంశాల‌ను ప్ర‌స్తావించిన ఆయ‌న.. తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లించాల్సిన ప‌రిహారంపై లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 80శాతం బాధితుల‌కు మేలు చేసేలా రూ.1100కోట్లు విడుద‌ల చేస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ హామీ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. వెంట‌నే బాధితుల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు. బాధితుల్లో ఎక్కువ‌గా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నార‌ని వారిని ఆదుకోవాల‌న్నారు.

Next Story