టీడీపీ ఎంపీ కేశినేని నానికి క‌రోనా పాజిటివ్

MP Kesineni nani test covid-19 positive.తాజాగా టీడీపీ ఎంపీ కేశినేనికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 2:32 PM IST
MP Kesineni nani

దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులకు క‌రోనా సోకింది. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేనికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉండాలని.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి' అని ట్వీట్ చేశారు.

గ‌డిచిన‌ 24 గంటల్లో 35,741 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 5,086 పాజిటివ్ కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైప పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,42,135కి చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాఓ 617 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 31 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపూర్, కర్నూల్, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,745 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,03,072 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,55,70,201 శాంపిల్స్ ను పరీక్షించారు.


Next Story