ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. గుంటూరులో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడి ఒంటిపై దద్దుర్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలుడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆ బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
ఒడిశాకు చెందిన ఆ బాలుడు 16 రోజుల కిందట పల్నాడు జిల్లాకు తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. వ్యాధి నిర్థారణ కోసం బాలుడి నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. నివేదిక వచ్చిన తరువాత దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడితో సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఇక ఇంతక ముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే.. ఆ చిన్నారికి పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది.