క‌బ‌డ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

MLA Roja playing Kabaddi in Nagari.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు నగిరి ఎమ్మెల్యే రోజా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 6:06 PM IST
MLA Roja playing Kabaddi in Nagari

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు నగిరి ఎమ్మెల్యే రోజా. నిండ్ర మండల కేంద్రంలో కబడ్డీ టోర్నమెంట్ ను ఆమె ప్రారంభించారు. నగరి, పుత్తూరు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన ఆమె యువకులతో కలిసి కాసేపు సరదాగా కబడ్డీ ఆడారు. నిండ్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన అంబేద్కర్ సెలెక్ట్ 7వ సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించడానికి ఎమ్మెల్యే రోజా ఈ ఉదయం విచ్చేశారు. తిరువేలంగాడు - రేణిగుంటల మధ్య రసవత్తర పోరు జరుగుతున్న నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా ఒక సారి రేణిగుంట తరపు నుంచి మరో సారి తిరువేలంగాడు జట్ల తరపు నుంచి కబడ్డీ ఆడి ప్రేక్షకులను అలరించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. కబడ్డీ మన భారతదేశపు క్రీడ అని క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న రోజా ఇలా కబడ్డీ ఆడటం పై నెటిజన్లు ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. బాగా ఆడుతున్నారు రోజా గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.




Next Story