తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు.. భోగి మంటలను వేసిన ఎమ్మెల్యే రోజా

MLA Roja Bhogi celebrations at Settipalli Village.తెలుగువారి లోగిళ్ళ సంక్రాంతి పండగ సంద‌డి మొద‌లైంది. తెలుగు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jan 2022 9:50 AM IST
తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు.. భోగి మంటలను వేసిన ఎమ్మెల్యే రోజా

తెలుగువారి లోగిళ్ళ సంక్రాంతి పండగ సంద‌డి మొద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లోని వాడ‌వాల‌లా వేకువ‌జామునుంచే భోగి మంట‌ల కాంతుల‌తో వెలుగులు నింపుకున్నాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద అంద‌రూ సంద‌డి చేస్తున్నారు. భోగి.. భోగ‌భాగ్యాలు క‌లిగించాల‌ని, ఏడాదంతా సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని కోరుకుంటూ భోగిమంట‌లు వేసుకుంటున్నారు. ప్ర‌తి ఇంట న‌వ‌ధాన్యాలు, సిరి సంప‌ద‌లు ఏడాది పాటు ఉండాల‌ని కోరుకుంటూ పాత వ‌స్తువుల‌ను తీసివేస్తూ వాటితో భోగిమంట‌లు వేసుకుంటూ కోరింత‌లు కొడుతున్నారు. ప‌లువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి.. ప్రజలుకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నేపధ్యంలో కడప జిల్లాలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. సంబేపల్లి మండలం శెట్టిపల్లి లో భోగి పండగను జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండగను జరుపుకోవడానికి రోజా శెట్టిపల్లిలోని తన సోదరుడు మాజీ జడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ రోజు తెల్లవారు జామునే తన కుటుంబసభ్యులు , బంధువులతో కలిసి ఎమ్మెల్యే రోజా భోగిమంటలు వేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెప్పారు.

Next Story