పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు.. హైకోర్టులో ముందస్తు బెయిల్

ఏపీలో ఎన్నికల వేళ ఈవీఎంను ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 12:07 PM GMT
mla pinnelli,  high court, bail petition,

 పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు.. హైకోర్టులో ముందస్తు బెయి

ఏపీలో ఎన్నికల వేళ ఈవీఎంను ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది కాస్త వైరల్ కావడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అనుచరులతో కలిసి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చర్యలు ప్రారంభించింది. ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటుగా అతని అనుచరులను అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈక్రమంలోనే పోలీసులు పిన్నెల్లి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

రెండ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. ఒక వైపు పోలీసులు గాలింపు జరుగుతుంటే.. మరోవైపు పిన్నెళ్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును విజ్ఞప్తి చేశారు. కాగా.. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించేందుకు ఏపీ హైకోర్టు కూడా అంగీకరించింది. ఇక ఓ వైపు పోలీసుల వేట.. మరోవైపు పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌.. ఇలాంటి పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఏపీలో చర్చనీయాంశం అయ్యింది.

పిన్నెల్లి కోసం పోలీసులు వెతికినా దొరక్కపోవడంతో.. ఏకంగా ఆయనపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా ఆయనకోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్‌ పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లారు పిన్నెల్లి. అక్కడ ఒక ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఆ వీడియో ఫుటేజ్‌ బయటకు రావడంతో ఈసీ సీరియస్‌ అయ్యి చర్యలు ప్రారంభించింది.

Next Story