MLA Mekapati Vs YCP: వేడెక్కిన రాజకీయాలు.. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే మేకపాటి
వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురై
By అంజి Published on 31 March 2023 1:15 PM ISTMLA Mekapati Vs YCP: వేడెక్కిన రాజకీయాలు.. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే మేకపాటి
వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురై మర్రిపాడులోని తన నివాసంలో చికిత్స పొందుతున్నారు. ఉదయగిరిలో కొనసాగుతున్న ఆందోళనపై మీడియా ప్రశ్నించగా.. తనకు ఆరోగ్యం బాగాలేదని, ఇప్పుడు మాట్లాడలేనని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
మరోవైపు ఉదయగిరిలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. పార్టీ ద్రోహి చంద్రశేఖర్‌రెడ్డిని నియోజకవర్గం విడిచిపెట్టాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి, ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధంతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు చంద్రశేఖర్‌రెడ్డిపై ఆ పార్టీ నేత మూల వినయ్‌రెడ్డి, చేసర్ల సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి పది ఓట్లు కూడా రావని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ము చంద్రశేఖర్ రెడ్డికి ఉందా అని జిల్లా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. చంద్రశేఖర్‌రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వబోమని నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మేకపాటి గురువారం సాయంత్రం ఉదయగిరి బస్టాండ్‌కు వెళ్లి రోడ్డుపై ఉన్న కుర్చీలో కూర్చున్నారు.