ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరు మార్పుపై బాల‌య్య‌.. మిమ్మ‌ల్ని మార్చడానికి ప్రజలున్నారు

MLA Balakrishna responded to NTR Health University Name Change.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల అసెంబ్లీ వేదిక‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sept 2022 11:09 AM IST
ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరు మార్పుపై బాల‌య్య‌.. మిమ్మ‌ల్ని మార్చడానికి ప్రజలున్నారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల అసెంబ్లీ వేదిక‌గా డాక్ట‌ర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం పేరును డాక్ట‌ర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంగా మార్చ‌డంపై న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ తీవ్రంగా స్పందించారు. మార్చేయ‌డానికి.. తీసేయ‌డానికి ఎన్టీఆర్ అన్న‌ది పేరు కాదు. ఓ సంస్కృతి, ఓ నాగ‌రిక‌త‌.. తెలుగుజాతి వెన్నెముక‌.

తండ్రి గ‌ద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చాడు. ఇప్పుడు కుమారుడు గ‌ద్దెనెక్కి వ‌ర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మ‌ల్ని మార్చ‌టానికి ప్ర‌జ‌లున్నారు. పంచ‌భూతాలున్నాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

అక్క‌డ ఆ మ‌హానీయుడు పెట్టిన బిక్ష‌తో బ‌తుకుతున్న నేత‌లున్నారు, పీత‌లున్నారు. విశ్వాసం లేని వాళ్ల‌ని చూసి కుక్క‌లు వెక్కిరిస్తున్నాయ్‌.. శున‌కాల ముందు త‌ల‌వంచుకు బ‌తికే సిగ్గులేని బతుకులు అని బాల‌కృష్ణ సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు.



Next Story