విశాఖలో మహా సంప్రోక్షణ.. ముఖ్య‌మంత్రి జగన్‌కు టీటీడీ ఆహ్వానం

Minister Vellampalli Srinivas and YV SubbaReddy meet CM jagan.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 15 March 2022 12:41 PM IST

విశాఖలో మహా సంప్రోక్షణ.. ముఖ్య‌మంత్రి జగన్‌కు టీటీడీ ఆహ్వానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేద పండితులు మంగ‌ళ‌వారం శాస‌న స‌భ‌లో కలిశారు. ఈ సంద‌ర్భంగా విశాఖ‌ప‌ట్నంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించారు. అనంత‌రం వేద పండితులు సీఎం జ‌గ‌న్‌కు ఆశీర్వ‌చ‌నం ఇచ్చి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.




Next Story