వారు అంబేద్కర్ ను కూడా అవమానించారు: రోజా

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు ఓ వర్గం మీడియాకు

By Medi Samrat  Published on  20 Jan 2024 6:45 PM IST
వారు అంబేద్కర్ ను కూడా అవమానించారు: రోజా

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు ఓ వర్గం మీడియాకు గౌరవం లేదని మంత్రి రోజా అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు పచ్చ మీడియాకు మనసు రాలేదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని.. ఆయన్ను అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను, పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు.

అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని.. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని రోజా ప్రశ్నించారు. అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు.


Next Story