అధిక ధ‌ర‌ల‌కు అమ్ముకోమ‌ని ఏ చ‌ట్టం చెబుతోంది.. వ‌ర్మ‌కు మంత్రి పేర్ని నాని కౌంట‌ర్‌

Minister Perni nani Replay to Director Ram Gopal Varma.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 5:10 AM GMT
అధిక ధ‌ర‌ల‌కు అమ్ముకోమ‌ని ఏ చ‌ట్టం చెబుతోంది.. వ‌ర్మ‌కు మంత్రి పేర్ని నాని కౌంట‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం పై ఇంకా మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్స్ యాజమాన్యాలు, ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ విష‌యంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, మంత్రుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌భుత్వానికి ప‌ది ప్ర‌శ్న‌ల పేరుతో ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో పాటు వ‌రుస ట్వీట్ల‌ను చేశాడు. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏంటో చెప్పాల‌ని వ‌ర్మ ప్ర‌శ్నించాడు.

కాగా.. వ‌ర్మ అడిగిన ప్ర‌శ్న‌ల‌పై ఏపీ సినిమాట్రోగ్ర‌ఫీ మంత్రి షేర్ని నాని స‌మాధానం చెబుతూ కౌంట‌ర్ ఇచ్చారు. వ‌ర్మ అడిగిన ఒక్కో ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూనే మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌ర్మ‌కు సంధించారు.

- "గౌరవనీయులైన @RGVzoomin గారూ.. మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని ప్ర‌శ్నించారు.

- ఇక‌ ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలని తెలిపారు.

- సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణ‌యిస్తున్నాయ‌ని తెలిపారు.బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ. సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు రామ్ గోపాల్ వర్మ గారూ.

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు ఆర్జీవీ గారూ. ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు. మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?" అంటూ వ‌ర్మ‌కు వ‌రుస ప్ర‌శ్న‌లు సంధించారు.


Next Story