ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త.. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By - అంజి |
ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త.. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో, ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నిధులు విడుదల కావడం పట్ల విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు పొందే మార్గం సుగమమైంది.
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు తక్షణ సహాయం అందిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం నేడు ₹1,200 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి సంబంధించిన బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (BROs) కూడా జారీ అయ్యాయి. ప్రతి విద్యార్థికి, తల్లిదండ్రులకు నేను ఇచ్చే హామీ ఒక్కటే: విద్యలో ఎవరికీ ఎటువంటి అడ్డంకులు ఎదురుకావు. పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను చెల్లించడం మరియు భవిష్యత్తులోనూ సకాలంలో సహాయం అందేలా చూడటం మా ప్రభుత్వ స్పష్టమైన నిబద్ధత. పూర్తి ఆత్మవిశ్వాసంతో చదువుకోండి - మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
I’m happy to inform that ₹1,200 crore is released today towards Fee Reimbursement & Scholarships through the latest BROs, providing immediate support to lakhs of students across Andhra Pradesh.For every student and parent: no one will face hurdles in education. Clearing all… pic.twitter.com/4tdj5i7qvj
— Lokesh Nara (@naralokesh) February 10, 2026