మంగళగిరి వాకర్స్‌కు మంత్రి లోకేష్ గుడ్‌న్యూస్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన సొంత డబ్బు రూ.5 లక్షల చెల్లించి మంగళగిరి ఏకోపార్క్‌లో వాకర్స్ ఫ్రీ ఎంట్రీ కల్పించారు.
By అంజి
మంగళగిరి ఎకోపార్కులో వాకర్స్‌కి ఫ్రీ ఎంట్రీ
మంగళగిరిలోని ఎకోపార్కులో వాకర్స్‌కి ఇకపై ఉచిత ప్రవేశం ఉంటుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన సొంత డబ్బు రూ.5 లక్షల చెల్లించి మంగళగిరి ఏకోపార్క్‌లో వాకర్స్ ఫ్రీ ఎంట్రీ కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో వాకర్ నుంచి నెలకు రూ.300, సంవత్సరానికి రూ.3 వేలు వసూలు చేసేవారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్కులో ఉచిత ప్రవేశం కల్పించాలని లోకేష్‌ను కోరారు. వాకర్స్‌కి ఇచ్చిన హామీని నారా లోకేష్ నిలబెట్టుకున్నారు.
''మంగళగిరి ఎకోపార్కులో ప్రవేశరుసుం తొలగించాల్సిందిగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరగా, మాట ఇచ్చాను. ఈ విషయమై ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడాను. అయితే ఫారెస్టుశాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారు. వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధులనుంచి చెల్లించాను. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6నుంచి 9గంటల వరకు ఎకోపార్కులో నడక సాగించవచ్చని తెలియజేస్తున్నాను'' అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు.
మంగళగిరి ఎకోపార్కులో ప్రవేశరుసుం తొలగించాల్సిందిగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరగా, మాట ఇచ్చాను. ఈ విషయమై ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడాను. అయితే ఫారెస్టుశాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారు.… pic.twitter.com/NFpFQsn6Sj
— Lokesh Nara (@naralokesh) March 11, 2025