భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు డేట్ ఫిక్స్

మే 3న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ

By అంజి  Published on  10 April 2023 10:30 AM GMT
Minister Gudivada Amarnath,  cm jagan, bhogapuram airport

భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు డేట్ ఫిక్స్ 

మే 3న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈరోజు మంత్రి అమర్‌నాథ్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, ఎమ్మెల్యే బద్దుకొండ అప్పల నాయుడుతో కలిసి సోమవారం భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూములను సందర్శించారు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మే 3న భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. దాదాపు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు.

Next Story