టీ మాస్టర్ అవతారం ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికలంటేనే ప్రచారం.

By Srikanth Gundamalla
Published on : 28 Feb 2024 12:18 PM IST

minister ambati rambabu, tea master, andhra pradesh,

టీ మాస్టర్ అవతారం ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికలంటేనే ప్రచారం. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే కాదు.. కొన్నిసార్లు వారు చేసే పనులను తాము అనుకరిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే బాటలో నడిచారు. టీ మాస్టర్‌ అవతారం ఎత్తారు. ఓ టీ కొట్టులోకి వెళ్లిన మంత్రి అంబటి రాంబాబు స్వయంగా టీ చేశారు. ఆ తర్వాత స్థానికులు, కార్యకర్తలు, అభిమానులకు తన చేతి టీ టేస్ట్‌న చూపించారు. మంత్రి అంబటి రాంబాబు టీ పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వైపు టీడీపీ-జనసేన అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించాయి. తొలి విడుత జాబితా విడుదల కావడంతో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీ కూడా ప్రచారంలో పాల్గొంటోంది. ముఖ్యనేతలంతా వరుసగా ప్రజలను కలుస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండ్రోజులుగా మంత్రి అంబటి రాంబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. బుధవారం ఉదయం సత్తెనపల్లిలో ఆయన పర్యటించారు. ఉదయం ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ టీస్టాల్‌కు వచ్చిన మంత్రి అంబటి.. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత టీస్టాల్‌లో టీ మాస్టర్‌ అవతారం ఎత్తారు.

స్వయంగా టీ తయారు చేశారు. పాలు కలిపి.. ఆ తర్వాత టీ పౌడర్‌ వేసి.. చెక్కర వేసి టీ రెడీ చేశారు. తయారు చేసిన టీని ఆయనే స్వయంగా తాగారు. తన అనుచరులకు కూడా టీ ఇచ్చారు. టీ స్టాల్‌ వద్దకు వచ్చిన ఇతర స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్‌గా మారడం స్వయంగా టీ టేస్టీగా చేసి ఇవ్వడంతో అనుచరులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ మంత్రి అంబటిలో మంచి టీ మాస్టర్‌ కూడా ఉన్నారంటూ చమత్కరిస్తున్నారు.


Next Story