ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్..

Mega Vaccination Drive in Andhrapradesh.ఏపీలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. ఒకే రోజు 8 ల‌క్ష‌ల నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2021 11:12 AM IST
ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్..

ఏపీలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. ఒకే రోజు 8 ల‌క్ష‌ల నుంచి 10ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు వేయాల‌నే ల‌క్ష్యంగా వైద్యారోగ్య ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాలకు కలిపి 14 లక్షల డోసుల టీకా చేరింది. తూర్పుగోదావ‌రి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల‌కు ల‌క్ష చొప్పున డోసులు విజ‌య‌వాడ నుంచి వెళ్లాయి. మిగ‌తా జిల్లాల‌కు 50 వేల టీకా డోసులు పంపారు. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులున్న తల్లులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నారు. ఐదు సంవ‌త్స‌రాలలోపు పిల్ల‌లు ఉన్న త‌ల్లలు రాష్ట్రంలో సుమారు 18ల‌క్ష‌ల మంది ఉన్నారు. వీరిలో శ‌నివారం వ‌ర‌కు 28 శాతం మంది తొలి టీకా వేయించుకున్నారు.

దీంట్లో భాగంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి జనాలు భారీగా తరలివచ్చారు. గతంలో ఒక డోసు వేయించుకున్నవారికి రెండో డోసు వేస్తున్నారు. అలాగే మొదటి డోసు వేయించుకోవటానికి వచ్చినవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే విదేశాల‌కు వెళ్లే వారికి కూడా నేడు వ్యాక్సిన్ వేయ‌నున్నారు. కాగా.. గ‌తంలో ఒకే రోజు 6లక్షల వ్యాక్సిన్లు వేసి చ‌రిత్ర సృష్టించింది ఏపీ ప్ర‌భుత్వం.

Next Story