మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్‌.. అగ్ర మావోయిస్టు హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి!

అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.

By -  అంజి
Published on : 18 Nov 2025 10:56 AM IST

Massive encounter, Maredumilli, Top Maoist Hidma , Maoists killed

మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్‌.. అగ్ర మావోయిస్టు హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి!

అమరావతి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. టైగర్‌ జోన్‌లో కూంబింగ్‌ కొనసాగుతోంది. ఏపీ - ఛత్తీస్‌గఢ్‌ - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్‌ మొదలు పెట్టారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా, ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందినట్టు సమాచారం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి మృతి చెందినట్టు సమాచారం. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నాడని తెలుస్తోంది.

Next Story