గుడ్‌న్యూస్‌.. రైతులకు వాట్సాప్‌లో AIMIP సేవలు

ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేస్తూ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

By -  అంజి
Published on : 11 Feb 2026 8:08 AM IST

Mana Mitra WhatsApp Platform AP, AP Micro Irrigation Project (APMIP), Atchannaidu Agriculture Minister Updates, Drip Irrigation Subsidy AP Online, AP Digital Governance for Farmers

గుడ్‌న్యూస్‌.. రైతులకు వాట్సాప్‌లో AIMIP సేవలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేస్తూ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'మన మిత్ర' వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్‌ఫారంలో ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (APMIP) సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. దీనివల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే వేగవంతమైన సేవలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. 'రైతులు ఫోన్‌తో 9552300009' నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని పంపి, APMIPను ఎంపిక ఏసుకోవాలి. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకోవడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. డ్రిప్‌ ఇరిగేషన్‌, స్ప్రింక్లర్లు ఆన్‌లైన్‌లో కొని సురక్షిత చెల్లింపులు చేయొచ్చు అని తెలిపారు.

వాట్సాప్ ద్వారా సేవలు పొందడం ఎలా?

రైతులు తమ మొబైల్‌లో 9552300009 నంబరును సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో 'Hi' (హాయ్) అని మెసేజ్ పంపాలి. అనంతరం వచ్చే ఆప్షన్లలో 'ఉద్యానశాఖ' (Horticulture)ను ఎంచుకోవడం ద్వారా కింది సేవలను పొందవచ్చు:

సబ్సిడీ రిజిస్ట్రేషన్: సూక్ష్మ సేద్యం పరికరాల కోసం సబ్సిడీ నమోదు.

దరఖాస్తు స్థితి (Application Status): దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడం.

గ్రీవెన్స్ నమోదు: సమస్యలు లేదా ఫిర్యాదులను వాట్సాప్ ద్వారానే తెలియజేయడం.

చెల్లింపులు: నాన్-సబ్సిడీ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే చెల్లించడం.

డిజిటల్ విప్లవంతో రైతులకు లాభాలు:

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్, సోలార్ పంపుల వంటి పరికరాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ 'మన మిత్ర' ప్లాట్‌ఫారం గురించి గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, విస్తృత ప్రచారం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Next Story