ప్రేమించిన అమ్మాయి కాదంద‌ని.. కూల్‌డ్రింక్‌లో ఎలుక‌ల ముందు క‌లుపుకుని

Man suicide attempt in guntur.తాజాగా ప్రేమించిన యువ‌తితో విభేదాల కారణంగా ఓ యువ‌కుడు సెల్పీ వీడియో తీసుకుని కూల్ డ్రింక్ లో ఎలుకల మందును క‌లుపుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2021 9:43 AM GMT
Man suicide attempt in guntur

చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదిరించ‌లేక.. అన్నింటికి ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణం అనే భావ‌న ఇటీవ‌ల యువ‌త‌లో ఎక్కువైంది. త‌ల్లిదండ్రులు తిట్టార‌నో, ఉపాధ్యాయులు కొట్టార‌నో, ఫ్రెండ్స్ ఎగ‌తాళి చేశార‌నో, ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టింద‌నో కార‌ణంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతూ.. వారి త‌ల్లిదండ్రుల‌కు తీర‌ని క‌డుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ప్రేమించిన యువ‌తితో విభేదాల కారణంగా ఓ యువ‌కుడు సెల్పీ వీడియో తీసుకుని కూల్ డ్రింక్ లో ఎలుకల మందును క‌లుపుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపింది.

వివ‌రాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట మండ‌లం గుర‌వాయిపాలేనికి చెందిన మ‌హేష్ బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలోని నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. చ‌దువుకునే రోజుల్లో ఓ యువ‌తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. అయితే.. వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలీదు కానీ.. మ‌హేష్ ఉద్యోగానికి సెల‌వు పెట్టి గుంటూరుకి వ‌చ్చాడు. ఇంటికి వెళ్ల‌కుండా ఐడీ ఆస్ప‌త్రికి ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో గ‌దిని అద్దెకు తీసుకున్నాడు. బ‌య‌ట‌కు వెళ్లి ఎలుక‌ల మందు, కూల్‌డ్రింక్ తెచ్చుకున్నాడు. కూల్ డ్రింక్‌లో ఎలుక‌ల మందు క‌లుపుకుని తాగాడు.

అనంత‌రం బ్లేడ్‌తో చేయి కోసుకుని ర‌క్తం పోవ‌డాన్ని వీడియో తీసి కుటుంబ స‌భ్యుల‌కు పంపించాడు. చేయి కోసుకోవ‌డంతో ర‌క్తం ధారాలంగా కారుతుండ‌డంతో నొప్పిని భ‌రించ‌లేక అరుస్తూ ఉన్నాడు. గ‌దిలోంచి శ‌బ్దాలు వ‌స్తుండ‌డంతో లాడ్జి సిబ్బంది త‌లుపులు ప‌గ‌ల‌కొట్టి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న న‌ల్ల‌పాడు పోలీసులు అత‌డిని 108లో జీజీహెచ్‌కు త‌ర‌లించారు. ఈలోపు అక్క‌డికి చేరుకున్న అత‌డి కుటుంబ స‌భ్యులు అత‌డిని ప్రైవేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. కాగా.. ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story
Share it