ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్‌బాబు ఆస్ట్రేలియాలోని అడిలైట్ రాష్ట్రంలోని సరిస్‌బరిలో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితమే అతడికి వివాహాం జరిగింది. పది నెలల క్రితం అతడికి ఓ బాబు పట్టాడు. కాన్ఫు కోసం ఇండియా వచ్చిన అతడి భార్య కరోనా మహమ్మారి కారణంగా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది. నిబంధనలు సడలించడంతో.. బిడ్డతో పాటు ఆమె నిన్న ఆస్ట్రేలియా బయలుదేరారు. చెన్నైకి వెళ్లిన అనంతరం తన భర్త హరీశ్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానించిన ఆమె ఆస్ట్రేలియాలో హరీశ్ నివాసం ప్రక్కనే ఉన్న వారికి ఫోన్ చేసింది.
వారు హరీశ్ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హరీష్ ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోనే వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కారణంగా హరీష్‌ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. హరిశ్ తండ్రి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి వ్యాపార లాభాదేవీల్లో ఏదో వివాదం ఉందని.. దానిని సెటిల్‌మెంట్ చేసుకుని ఇండియాకు వచ్చి ఇక్కడే ఉంటానని చెప్పినట్లు తెలిపాడు.