విషాదం.. భార్యను కాపాడబోయి రైలు కింద పడి భర్త మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 July 2024 2:00 PM ISTవిషాదం.. భార్యను కాపాడబోయి రైలు కింద పడి భర్త మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు నుంచి కిందపడిపోయిన భార్యను కాపాడబోయిన భర్త.. తాను రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతులు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రంలోనే నంద్యాల జిల్లా ఎర్రగంట్ల వద్దకు రాగానే నిద్రమత్తులో ఉన్న అసియాబాను రైలు నుంచి జారి కిందపడిపోయింది. అది గమనించిన భర్త ఆసిఫ్ భార్యను కాపాడాలనుకుని వెంటనే రైలు నుంచి కిందకు దూకాడు. ఈ సంఘటనలో భార్య తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడింది. కానీ.. దురదృష్టవశాత్తు భర్త సయ్యద్ ఆసిఫ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సయ్యద్ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కాగా..ఈ దంపతులు గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. నాలుగు నెలల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారనీ.. అంతలోనే ఈ పెను విషాదం ఇద్దరినీ విడదీయడంతో పలువరు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.