తూర్పుగోదావరి జిల్లాలో హృదయ విదారక ఘటన.. కూర్చున్న కుర్చీలోనే..
Mallepally Panchayat Secretary died due to corona virus.కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారి
By తోట వంశీ కుమార్ Published on 1 May 2021 6:30 AM GMTకరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఎవ్వరిని ఈ మహమ్మారి బలితీసుకుంటుందో తెలియడం లేదు. తన కార్యాలయంలో విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలాడు. ఈ హృదయవిదారక ఘటన తూర్పుగోదావరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా జయశంకర్ నారాయణ పనిచేస్తున్నారు.
గత నాలుగు రోజులుగా జయశంకర్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికి శుక్రవారం కూడా విధులకు హాజరయ్యాడు. అయితే.. మధ్యాహ్నాం ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయి మృతి చెందాడు. అయితే.. జయశంకర్ కరోనా లక్షణాలతో మరణించారని బావించిన ఉద్యోగులు ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు సాహించలేదు. ఆయన మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 86,494 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 17,354 పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,01,690 కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 2,764 మంది, అత్యల్పంగా 661 మంది కరోనా బారిన పడ్డారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే 64 మంది మృతిచెందగా.. ఈ మహమ్మారి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,992కి చేరింది.
నిన్న 8,468 మంది కోలుకోగా.. మొత్తంగా కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 9,70,718కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,22,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,63,90,360 సాంఫిల్స్‌ను పరీక్షించారు.