మహానందిలో మరోసారి టెన్షన్
మహానందిలో ప్రజలు చిరుత భయంతో వణికిపోతూ
By Medi Samrat Published on 27 July 2024 4:08 PM ISTమహానందిలో ప్రజలు చిరుత భయంతో వణికిపోతూ ఉన్నారు. మరోసారి చిరుత సంచరించిందంటూ పలు విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. మహానంది పరిసర ప్రాంతాల్లోనే చిరుత సంచారం కొనసాగుతూ ఉంది. చిరుత సంచారంతో గత 15 రోజులుగా భక్తులు టెన్షన్ పడుతూ ఉన్నారు. మహానంది ఆలయ సమీపంలో చిరుత పులి సంచారం సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది.
మూడు వారాల క్రితం కూడా మహానంది క్షేత్రం వద్ద చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులు భయపడి పరుగులు తీశారు. నంద్యాల నియోజకవర్గం మహానందిలో చిరుత పులి గత కొద్ది రోజులుగా తిరుగుతుంది. ఇటీవల గోశాల సమీపంలో చిరుత కనిపించింది. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న చిరుతపులి అక్కడే తిరుగుతుంది. రాత్రి వేళలో భక్తులు, స్థానికులు ఎవరూ ఒంటరిగా తిరగవద్దని, బయట నిద్రించవద్దని కూడా అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
Next Story