నర్సీపట్నంలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. దీనిపై టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అయ్యన్నపై కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నోటీసుల పేరుతో పోలీసులు అర్థరాత్రి హైడ్రామా చేశారన్నారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందన్నారు.
'నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో చంద్రబాబు గారి పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకొని పిరికిపంద చర్యలు మొదలెట్టారు. అయ్యన్నపై వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుంది' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.