చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు: నారా బ్రాహ్మణి
'కాంతితో క్రాంతి' కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 8:10 AM GMTచీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు: నారా బ్రాహ్మణి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, శ్రేణులు చాలా రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల మోతమోగిద్దాం పేరుతో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా 'కాంతితో క్రాంతి' కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని పాటించాలని కోరారు. ఇళ్లలో లైట్లు ఆపి.. దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లైట్లు వెలగించి చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నారా లోకేశ్ సతీమని బ్రాహ్మిణి కూడా కోరారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని బ్రాహ్మణి అన్నారు. దీనిపై బ్రాహ్మణి ట్వీట్ చేశారు. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారని అన్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలియదని, మనమెందుకు చీకట్లో ఉండాలి అని బ్రాహ్మిణి ప్రశ్నించారు. అక్టోబర్ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్ టార్చ్, కొవ్వొత్తులు వెలిగిద్దామని పిలుపునిచ్చారు. ఒకవేళ రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం’’ అని బ్రాహ్మణి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పేర్కొన్నారు.
మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి... దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు గారు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?… pic.twitter.com/v0i6zYT1aP
— Brahmani Nara (@brahmaninara) October 6, 2023
మరోవైపు క్రాంతితో కాంతి కార్యక్రమంపై చంద్రబాబు నాయుడు సతీమని భువనేశ్వరి కూడా స్పందించారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని ఆమె అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోందన్నారు. ఆ చీకటిని తరిమికొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని పేర్కొన్నారు.