ఏపీలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రులు ఇవే..

List of AP black fungus hospitals.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్ పై అలర్ట్ అయ్యింది.రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వాసుపత్రుల్లో దీని ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 8:15 PM IST
Black fungus hospitals in AP

బ్లాక్ ఫంగస్ కేసులు భారత్ ను టెన్షన్ పెడుతూ ఉండడంతో దానిని ఎపిడెమిక్ గా గుర్తించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద దానిని 'ప్రమాదకరమైన జబ్బు'గా గుర్తించాలంటూ ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స, నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలిన ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదేశించారు. ప్రతి బ్లాక్ ఫంగస్ కేసునూ జిల్లాల అధికారులు ఆరోగ్య శాఖకు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆరోగ్య శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడులు బ్లాక్ ఫంగస్ ను ఎపిడెమిక్ గా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్ పై అలర్ట్ అయ్యింది. ఈ ఫంగస్ ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వాసుపత్రుల్లో దీని ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.

ఏపీలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రుల వివరాలు ఇవే:

అనంతపూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)

ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి

స్విమ్స్, తిరుపతి

జీజీహెచ్, కాకినాడ

జీజీహెచ్, గుంటూరు

జీజీహెచ్ (రిమ్స్), కడప

జీజీహెచ్, విజయవాడ

గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్

జీజీహెచ్, కర్నూలు

జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు

జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు

జీజీహెచ్, శ్రీకాకుళం

ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం

గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం

ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)

కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం

విమ్స్, విశాఖపట్నం

Next Story