ఏపీలో నేడు, రేపు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
By అంజి Published on 2 Nov 2023 1:45 AM GMTఏపీలో నేడు, రేపు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కోస్తాలో తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి. దీని ఎఫెక్ట్‌తో బుధవారం కోస్తాలో పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇక ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులో 9 సెం.మీ భారీ వర్షం కురిసింది. నేడు కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ చెప్పింది. అలాగే రేపటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాలో ఎక్కువ ప్రాంతాలు, ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న నంద్యాల, తిరుపతి, కడప జిల్లాల్లో వానలు పడ్డాయి. ఇక పగటి సమయంలో ఎండలు.. రాత్రిళ్లు చలి వాతావరణం కనిపిస్తోంది. ఈ భిన్నమైన వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నెలలో వర్షాలు భారీగానే పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే పరిస్థితి మాత్రం అలా లేదు. తేలికపాటి వానలు మినహా.. ఎక్కడ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కూడా నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.