విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మంగ‌ళ‌వారం విశాంత్ర(రిటైర్డ్) ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేయాల‌ని అందులో కోరారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా ప‌రిశ్ర‌మ‌ను లాభాల బాట ప‌ట్టించ‌వ్చ‌చున‌ని, ప్రైవేటీక‌ర‌ణ ఒక్క‌టే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌ని పిటిష‌న్ లో తెలిపారు. కాగా.. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది. ‌

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు..ఆంధ్రా హ‌క్కు అనే నినాదంతో ఏర్ప‌డిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో కార్మికుల ఉద్యమానికి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అంతేగాక స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడవడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియజేస్తూ కేంద్రానికి లేఖ పంపారు. ఇదే సమయంలో వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతూ.. కార్మికుల ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story