బలవంతంగా ముద్దు పెట్టాడని భర్త నాలుకను కొరికిన భార్య
కర్నూలు జిల్లాలో భర్త బలవంతంగా ముద్దు పెట్టాడని భార్య దారుణంగా ప్రవర్తించింది.
By Srikanth Gundamalla Published on 22 July 2023 11:25 AM ISTబలవంతంగా ముద్దు పెట్టాడని భర్త నాలుకను కొరికిన భార్య
కర్నూలు జిల్లాలో భర్త బలవంతంగా ముద్దు పెట్టాడని భార్య దారుణంగా ప్రవర్తించింది. ముద్దు పెట్టేందుకు వెళ్లిన భర్త నాలుకను కొరికింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కర్నలూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్.. తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పవతికి 2015లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమ వివాహం జరిగిన చాలా కాలం పాటు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. ఏమయిందో ఏమో తెలియదు కానీ.. గత రెండేళ్లుగా ఇద్దర మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అవి మరింత పెరిగాయి. ఇంట్లో అస్సలు కుదరుగా ఉండవేరు కాదు. పిల్లల ముందే గొడవపడే వారు. అయితే..జూలై 21న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పుష్పవతిపై తారాచంద్ దాడి చేశాడు.
గొడవ తర్వాత మళ్లీ భార్య దగ్గరకువెళ్లాడు భర్త తారాచంద్. ఆమె కోపాన్ని తగ్గించేందుకు మాట్లాడేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాట వినలేదు. ఆ తర్వాత బలవంతంగా ముద్దు పెట్టేశాడు. ఆ చర్యతో భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తకు బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో భర్త నాలుకను గట్టిగా కొరికేసింది. దాంతో తారాచంద్ అల్లాడిపోయాడు. రక్తస్రావం అవుతుండటంతో తనంతట తానే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. బాధితుడిని చూసిన డాక్టర్లు కొంచెం సీరియస్‌గా ఉందని.. అనంతపురం ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. గొడవ పడ్డాక భర్త నాలుకను భార్య కొరికిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అయితే.. ఇద్దరి మధ్య గొడవలపై దంపతుల వెర్షన్ ఒక్కరి ఒక్కోలా ఉంది. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆ తర్వాత బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడని చెప్పింది. అందుకే నాలుక కొరికానని తెలిపింది. గృహహింస కింద భర్తపై జొన్నగిరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇక తారాచంద్ తన భార్యపై ఆరోపణలు చేస్తున్నాడు. మరో వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని చెబుతున్నాడు. తన భార్య నుంచి ప్రాణహాని ఉందని చెబుతున్నాడు. పిల్లలు ఉన్నారని.. ఎలా బతకాలో అర్థం కావడం లేదని భర్త తారాచంద్ చెబుతున్నాడు.