కుప్పం టీడీపీ నేతలకు ఊరట

Kuppam TDP leaders get relief in High Court. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది.

By Medi Samrat
Published on : 23 Sept 2022 7:18 PM IST

కుప్పం టీడీపీ నేతలకు ఊరట

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి రాజకుమార్, మునుస్వామితో పాటు మరో నలుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్ తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఘర్షణ నేపథ్యంలో నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుని అన్యాయంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతాల డీపీగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులను ఉంచారు. #westandwithsreenivasulu అనే హ్యాష్ ట్యాగ్ ను టీడీపీ కార్యకర్తలు ట్రెండ్ చేశారు.

కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం ఘటనలో టిడిపి నేతలపై కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టి కేసు నమోదు చేసి టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు కోర్టు బెయిల్ తిరస్కరించడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు ఆ ఏడుగురికి బెయిల్ మంజూరు అయింది.


Next Story